Rayachoty: సీసీ కెమెరాల సహాయంతో తప్పిపోయిన వృద్ధురాలి ఆచూకీ లభ్యం!

Rayachoty: కర్ణాటకకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు వీరభద్రస్వామి ఆలయం వద్ద తప్పిపోగా సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Aug 2026 11:17 AM IST
Rayachoty
X

Rayachoty: సీసీ కెమెరాల సహాయంతో తప్పిపోయిన వృద్ధురాలి ఆచూకీ లభ్యం!

Rayachoty: కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌కు చెందిన గుర నింగవ, వయస్సు సుమారు 80 సంవత్సరాలు, తన కుటుంబ సభ్యులతో కలిసి రాయచోటిలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో కుటుంబ సభ్యుల నుంచి విడిపోయి తప్పిపోయారు.

ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు.విషయం తెలిసిన వెంటనే రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి.వి. చలపతి గారి ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ కెమెరా ఆపరేటర్ సురేందర్ వెంటనే స్పందించారు.

మహిళ చివరిసారిగా కనిపించిన ప్రాంతాన్ని గుర్తించడం ఆమె వెళ్లే అవకాశం ఉన్న మార్గాలను విశ్లేషించడం వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడం ఒక కెమెరా నుంచి మరో కెమెరా వరకు ఆమె కదలికలను ట్రాక్ చేయడం వంటి చర్యలను సమర్థవంతంగా చేపట్టారు.

సీసీ కెమెరా ఫుటేజ్‌ను క్రమపద్ధతిలో పరిశీలిస్తూ మహిళ వెళ్లిన మార్గాన్ని గుర్తించి, ఆమె ఆచూకీని త్వరితగతిన గుర్తించారు.అనంతరం పోలీసు సిబ్బంది సహాయంతో వృద్ధ మహిళను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సీసీ కెమెరా ఆపరేటర్‌కు ఇన్‌స్పెక్టర్ అభినందనలు.వృద్ధ మహిళను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంలో సీసీ కెమెరాల ద్వారా లభించిన సమాచారం కీలకంగా ఉపయోగపడింది.

ఈ సందర్భంగా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి.వి. చలపతి గారు, కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ కెమెరా ఆపరేటర్ సురేందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజలకు రాయచోటి పోలీసుల విజ్ఞప్తి “సీసీ కెమెరా – మన భద్రతకు బలమైన రక్షణ”. పట్టణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ, రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర సంఘటనలకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించడంలో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రాయచోటి పోలీసులు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story