Rayachoty: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Rayachoty: రాయచోటిలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో, కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 10 Aug 2026 12:41 PM IST
Rayachoty
X

Rayachoty: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

వైసీపీ ర్యాలీ ని అడ్డుకున్న పోలీసులు

అన్నమయ్య జిల్లా రాయచోటి:

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసిపి శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకుని ర్యాలీకి అనుమతులు లేవని, అనుమతులు లేకుండా ర్యాలీలు చేయరాదు అంటూ వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. పోలీసుల తీరు నిరసిస్తూ వైసీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయం వద్ద రోడ్డు పై బైఠాయించి ప్ల కార్డులు చేతపట్టి నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీని అడ్డుకోవడం పోలీసులకు తగదంటూ వైసిపి నేతలు ఆగ్రహించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story