Rayachoti: స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలుపే లక్ష్యం సుగవాసి!

Rayachoti: రాయచోటిలో ఎన్డీయే కూటమి సమన్వయ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో గెలుపే లక్ష్యమని సుగవాసి ప్రసాద్ బాబు వెల్లడి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Sept 2026 3:23 PM IST
Rayachoti
X

Rayachoti: స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలుపే లక్ష్యం సుగవాసి!

Rayachoti: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ–జనసేన–బీజేపీ NDA కూటమి నేతల తొలి సమన్వయ మరియు సన్నాహక సమావేశం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించారు.

ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు, జోనల్ కమిటీ చైర్మన్ దామాచర్ల సత్య గారు, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు దేవి ప్రసాద్ (రాజోలి ఎమ్మెల్యే) గారు, తాతంశెట్టి నాగేంద్ర గారు, అధికారి కృష్ణ గారు, దారం అనిత గారు, నరేంద్ర గారు, చల్లపల్లి నరసింహారెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో 100% స్ట్రైక్ రేట్‌తో NDA కూటమి ఘన విజయం సాధించడమే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి సమన్వయం, నాయకులు–కార్యకర్తల భాగస్వామ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేస్తూ, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజారంజక పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సుపరిపాలన ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని నేతలు అభిప్రాయపడ్డారు.

బలమైన స్థానిక సంస్థల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టి కృషితో క్షేత్రస్థాయిలో బలమైన సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI