Rayachoti: అన్నమయ్య జిల్లా ప్రజలకు మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు!

Rayachoti: అన్నమయ్య జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పర్యావరణహితంగా పండుగ జరుపుకోవాలని పిలుపు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Sept 2026 3:43 PM IST
Rayachoti
X

Rayachoti: అన్నమయ్య జిల్లా ప్రజలకు మంత్రి మండిపల్లి శుభాకాంక్షలు!

Rayachoti: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఇల్లు సంక్షేమం, సౌభాగ్యం, సంతోషాలతో శోభాయమానంగా వెలుగొందాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

అన్నమయ్య జిల్లాలోని పల్లెసీమలు పశుసంపద, వ్యవసాయ, ఉద్యాన పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలని కోరుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతో సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్తికర స్థాయిలో అందేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో అన్నమయ్య జిల్లా అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI