Rayachoty: రాయచోటి: ఇంద్రావతమ్మ నేత్రదానం, మరొకరికి వెలుగు!
Rayachoty: రాయచోటి బ్రాహ్మణ వీధికి చెందిన కె.ఇంద్రావతమ్మ మరణానంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడప ఎల్.వి. ప్రసాద్ ఐ బ్యాంక్‌కు నేత్రదానం చేశారు.
Rayachoty: రాయచోటి: ఇంద్రావతమ్మ నేత్రదానం, మరొకరికి వెలుగు!
లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో ఇంద్రావతమ్మ నేత్రదానం.
రిపోర్టర్ N సూర్య ప్రకాష్ రాజు
రాయచోటి, అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం బ్రాహ్మణ వీధిలో శివాలయం పక్కన కె.ఇంద్రావతమ్మ నేత్రదానం చేయడం జరిగిందని లయన్స్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ లయన్ కొత్త సుదర్శన్ తెలియజేశారు.
అనంతరం అధ్యక్షులు లయన్ యస్.ఆర్ .అంజనేయ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు రాయచోటి పట్టణం లో దాదాపు 37 మంది నేత్రాలను కడప ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కు డొనేట్ చేయడం జరిగిందని తెలిపారు.
అనంతరం ఆమె కుమారులు సునీల్ కుమార్,కిరణ్ కుమార్,చరణ్ లు మాట్లాడుతూ మా అమ్మగారు ఈ రోజు ఉదయం చనిపోవడం జరిగింది,ఆమె చనిపోయిన మరో ఇద్దరికి సహాయ పడాలనే ఉద్దేశంతో మా అమ్మగారి నేత్రాలను కడప ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారికి అందించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ షేక్ మహమ్మద్,కార్యదర్శి లయన్ షేక్ ఇందాద్ అహమ్మద్,కడప ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ కె.ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.




