Rayachoty: పోలీసుల అనుమతితోనే డీజేలు నిర్వహించాలి!

Rayachoty: రాయచోటిలో డీజే సౌండ్ సిస్టమ్స్ నిర్వాహకులకు డీఎస్పీ కృష్ణమోహన్ హెచ్చరిక. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 17 July 2026 4:52 PM IST
Rayachoty
X

Rayachoty: పోలీసుల అనుమతితోనే డీజేలు నిర్వహించాలి!

Rayachoty: డిజె సౌండ్ సిస్టం నిర్హహకులు తప్పని సరిగా పోలీసు వారి నిబంధనలు పాటించాలని నిభందనలు ఉల్లంఘీస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాయచోటి డియస్పి కృష్ణ మొహన్ హేచ్చరించారు.

రాయచోటి లో జిల్లా డిజె సౌండ్ సిస్టం అసోషియేషన్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభిచారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ అనుమతులతో డిజె సౌండ్ సిస్టం నిర్వహించాలని వాటి సౌండ్ పోలీసులు అనుమతించిన వరకే ఉపయోగించాలని సౌండ్ పెంచిన, రికార్డింగ్ నిర్వహించిన చర్యల తతప్పవని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా డిజె సౌండ్ సిస్టం ఏడాది కాలంలో చేసిన సేవలను కోనియాడారు. ఈ సంఘం ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోని పోలీసుల నిబంధనలు అమలు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సంఘాలు ఏర్పాటు చేసుకోని సంఘటితం అయితేనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని సూచించారు.

ఈ కార్యక్రమానికి మరో ముఖ్యఅతిథిగా టిడిపి జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హాజరయ్యారు. డిజె సౌండ్ సిస్టం సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలు ఏర్పడినప్పుడు తన సహకారం ఎప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ శిబిరంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. దాతలకు డియస్పి కృష్ణమొహన్, టిడిపి నేత సుగవాసి ప్రసాద్ బాబు చేతుల మీదుగా ప్రశంసపత్రాలు అందజేశారు. డియస్పి, టిడిపి నేతను సంఘం నిర్వహకులు సన్మానించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story