Rayachoty: ట్రాఫిక్ అలర్ట్: హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు!

Rayachoty: రాయచోటిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో సీఐ చాంద్ బాషా ట్రాఫిక్ అవగాహన సదస్సు చేపట్టారు. హెల్మెట్, మైనర్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్‌పై వాహనదారులను హెచ్చరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 1 Aug 2026 10:01 AM IST
Rayachoty
X

Rayachoty: ట్రాఫిక్ అలర్ట్: హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు!

రాయచోటి,అన్నమయ్య జిల్లా:

చిన్న నిర్లక్ష్యం...పెద్ద ప్రమాదాలకు కారణం... హెల్మెట్ ధరించండి...ప్రాణాలను కాపాడుకోండి...

ట్రాఫిక్ రూల్స్ పాటించండి... సురక్షితంగా గమ్యస్తానాన్ని చేరండి...

మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవు...

మైనర్ కి వాహనం ఇచ్చిన యజమానితోపాటు మైనర్ కి శిక్ష తప్పదు...

జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిబిల్లి ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకం, ఇన్సూరెన్స్ ,మైనర్ డ్రైవింగ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రాయచోటి ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా...

వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని , కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నమయ్య జిల్లా, రాయచోటి ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాల మేరకు సుండుపల్లి రోడ్డులో హెల్మెట్ వాడకం ,మైనర్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్ , డ్రంక్ అండ్ డ్రైవ్ లతో పాటు రోడ్డు నియమ నిబంధనలపై పట్టణ ట్రాఫిక్ సిఐ చాన్ బాషా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ హెల్మెట్ వాడక పోవడం వల్ల జరిగే నష్టాలను వాహనదారులకు తెలిపారు. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. చిన్నపిల్లలు సరదా పడుతున్నారని లేదా వారి అతిగారాబం వల్ల మైనర్లకు వాహనాలు తీయించడం కారణంగా వారి అతివేగం వల్ల వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని , అంతేకాకుండా మైనర్లతోపాటు తల్లిదండ్రులకు కఠిన శిక్షలు వర్తిస్తాయని తెలిపారు.ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి అని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబం నష్టపరిహారం పొందటానికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కచ్చితంగా చేసుకోవాలని సూచించారు.ప్రతి వాహనదారుడు సరైన పత్రాలను తమ వద్ద ఉంచుకోవడంతోపాటు, ట్రాఫిక్ నియమ , నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా తమ గమ్యస్థానాలను చేరాలని ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐతో పాటు రామాంజి , నాగేంద్ర, ఆంజనేయులు తో పాటు హోంగార్డు విరుపాక్షి పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story