Rayachoti: రాయచోటి జంప్ జిలానీల వల్ల వైసీపీకి నష్టం లేదు
Rayachoti: రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు. పార్టీని వీడే స్వార్థపరుల వల్ల వైసీపీకి నష్టం లేదని, నిబద్ధత గల కార్యకర్తలే పార్టీకి బలమని స్పష్టం.
Rayachoti: రాయచోటి జంప్ జిలానీల వల్ల వైసీపీకి నష్టం లేదు
రాయచోటి: రాజకీయాల్లో కండువాలు మార్చుకోవడం స్వార్థ పరులు, జంప్ జిలానీలు పార్టీలు మారడం గొప్ప విషయం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంత అభివృద్ధి చేశామన్నదే రాజకీయాలకు అసలైన కొలమానమని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడే వారితో వైఎస్ఆర్‌సీపీకి ఎలాంటి నష్టం ఉండదని, పార్టీని నమ్మి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలే రేపటి నాయకులని అన్నారు.పార్టీ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని, అనేక కీలక పదవులు,సముచిత గౌరవాలు కల్పించిందని ఆయన గుర్తు చేశారు.
అధికారమే పరమావధిగా భావించే కొందరు నాయకులు పార్టీని వీడినా పార్టీ బలహీనపడదని, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. గ్రామాలలో, వార్డులలో యువతలో ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న వారిని, నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని తయారు చేసి స్వార్థ రాజకీయాలు చేసే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.
పదవులు అనుభవించి,అధికారం లేదని, పార్టీని వీడిన వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు వైఎస్ఆర్‌సీపీ ద్వారా పెద్దపెద్ద పదవులు అనుభవించి, అన్ని రకాల గౌరవాలు పొందిన కొందరు నాయకులు పార్టీ అధికారంలో లేదని స్వార్థపరులు పార్టీని వీడటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
అలాంటి వారి తీరును ప్రజలు అసహ్యించు కుంటున్నారని, పార్టీకి అండగా నిలిచే నిజాయితీ గల కార్యకర్తలే వైఎస్ఆర్‌సీపీకి నిజమైన బలం అని స్పష్టం చేశారు. ఎన్ని అవమానాలు చేసినా, ఆర్థికంగా కష్టాలు వున్నా దిగజారకుకూడా పార్టీని భుజనా మోస్తున్నవారే నాయకులన్నారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కోసం.. గత ఎన్నికలలో కష్టపడిన నాయకులను విస్మరించి, గత స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులును చేసే దైర్యం లేక,గత స్థానిక ఎన్నికలలో దౌర్జన్యాలతో పదవులు పొందారని పదే పదే విమర్శించించే టి డి పి వారికి వారికి కండువాలు వేసి, ఇప్పుడు వారే ఆ పార్టీకి దిక్కు అయినట్లుగా ఉందన్నారు.
బడుగు బలహీన వర్గాలకు,మైనారిటీలకు,ఆర్థికంగా వెనుకబడిన వారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది వైఎస్ఆర్‌సీపీ
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం బీసీల సాధికారత కోసం చరిత్రాత్మకంగా 57 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి డైరెక్టర్లు, వేలాది మందికి అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి బీసీల కోసం 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాలేదని విమర్శించారు.
జగన్ హయాంలో వచ్చిన జిఓ తోనే ఇప్పుడు కూడా బిసి కార్పొరేషన్ల పదవులను భర్తీ చేసారన్నారు. రాయచోటి ప్రాంతంలో కూడా బడుగు, బలహీన వర్గాలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మున్సిపల్ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు వంటి అనేక పదవులు కల్పించామని తెలిపారు. వడ్డెర కు రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్లు, పాల ఏకిరి, మత్స్యకార, కురబ సామాజిక వర్గాలకు, మైనారిటీ సామాజిక వర్గాలకు కూడా రాష్ట్రస్థాయి అవకాశాలు ఇచ్చామని చెప్పారు.
మాట ఇచ్చినట్లుగానే మైనార్టీలకు ఎమ్మెల్సీతో పాటు డిప్యూటీ చైర్మన్ పదవిని కూడా వైఎస్ఆర్‌సీపీ కల్పించిందని పేర్కొన్నారు.ఓ దళిత మహిళకు శ్రీశైలం బోర్డ్ మెంబర్ గా ఇచ్చిన ఘనత గత జగన్ ప్రభుత్వందే నన్నారు.ఈ విధంగా మీరు చేయగలుగుతారా అని ఆయన ప్రశ్నించారు.ఇలా చెప్పుకుంటే నిస్వార్థంతో, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎన్నో పదవులును బడుగు, బలహీన వర్గాలకు వైఎస్ఆర్ సిపి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.ఇలాంటి పార్టీ ద్వారా పదవులు పొంది, అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుకుని కన్నతల్లి లాంటి పార్టీని వీడుతున్న వారిపట్ల మాకు ఎలాంటి నష్టం,ఆందోళన లేదన్నారు. దాడులు చేసిన వారితోనే వెళ్లి కలుస్తున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఇళ్లపై దాడులు చేశారని,ఇళ్లలోపలికి వచ్చి మహిళలను సైతం అవమానించారని, ఆస్తులను ధ్వంసం చేశారని, వ్యక్తిగత…




