Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళలు

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాఖీ పౌర్ణమి వేడుకల సందర్భంగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మహిళలు రాఖీలు కట్టి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Aug 2026 4:13 PM IST
Rayachoti
X

Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళలు

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి లో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి పలువురు మహిళలు ఆత్మీయంగా రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి గారు సోదరీమణుల ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధం ఎల్లప్పుడూ ప్రేమ, ఆప్యాయతలతో మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రేమానురాగాలు, ఆత్మీయతల నడుమ ఘనంగా జరిగాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story