Rayachoti: రాయచోటి: డ్రైవర్ తప్పుతో కుటుంబం రోడ్డున పడుతుంది!
Rayachoti: రాయచోటిలో ట్రాఫిక్ సీఐ ఛాన్ బాషా రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Rayachoti: రాయచోటి: డ్రైవర్ తప్పుతో కుటుంబం రోడ్డున పడుతుంది!
రాయచోటి. అన్నమయ్య జిల్లా
రోడ్డు భద్రత నియమాలను పాటించండి... ప్రమాదాలను నివారించండి...
అన్నమయ్య జిల్లా రాయచోటి:
మద్యం తాగి లేదా మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం నేరమని అన్నమయ్య జిల్లా రాయచోటి ట్రాఫిక్ సిఐ ఛాన్ భాష అన్నారు. కాకి చొక్కా ధరించే ప్రతి డ్రైవరు ప్రయాణికుల పాలిట దేవుడన్నారు.
రోడ్డు భద్రత నియమాల పట్ల ఆటో డ్రైవర్లతో పాటు పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు బాధ్యతని, ఒక డ్రైవర్ చేసే చిన్న తప్పు తనతో పాటు తన కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందన్నారు. హెల్మెట్ ప్రతి వాహనదారునికి రక్షణ కవచంలాంటిదని ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ఓవర్ లోడ్ తో వాహనం నడపడం వల్ల ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్లో రీల్స్ చూడడం నేరమని పట్టుబడిన వారిపై జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు. సరైన రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్క వాహనదారుని కర్తవ్యమని వీటివల్ల పడే జరిమానాల నుండి విముక్తి పొందచ్చన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు భద్రతా నియమాలను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలను చేరాలని కోరారు.
సమావేశంలో బస్టాండ్ ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సిద్ధిగాళ్ల శ్రీనివాసులు, సీపీఐ పట్టణ నాయకులు పి. ఆంజనేయులు, షేక్ ముబారక్, ట్రాఫిక్ కానిస్టేబుల్ నాగేంద్ర నాయక్,ఆటో కార్మికులు పాల్గొన్నారు.




