Rayachoti: చంద్రబాబు అక్రమ అరెస్టు ఒక చీకటి రోజు.. గండికోట సుధాకర్!
Rayachoti: రాయచోటి టీడీపీ కార్యాలయంలో 'నిజం గెలిచింది' పేరుతో 53 దీపాలు వెలిగించిన గండికోట సుధాకర్, బోనమల్ల ఖాదరవల్లి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన.
Rayachoti: చంద్రబాబు అక్రమ అరెస్టు ఒక చీకటి రోజు.. గండికోట సుధాకర్!
Rayachoti: రాయచోటి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంత్రి మండిపల్లి ఆదేశాల మేరకు రాయచోటి రూరల్ మండలాధ్యక్షుడు గండికోట సుధాకర్ మరియు రాయచోటి మున్సిపల్ అధ్యక్షుడు బోనమల్ల ఖాదరవల్లితో కలిసి నిజం గెలిచింది అనే నినాదంతో కార్యకర్తలతో కలిసి 53 దీపాలను వెలిగించడం జరిగింది.
గండికోట సుధాకర్ మాట్లాడుతూ 2023 సెప్టెంబర్ 9 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా 73 ఏళ్ల సీనియర్ నాయకుడిని అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టడంపై తెలుగు ప్రజలంతా మనోవేదనకు గురయ్యారన్నారు.
చివరకు కోర్టుల్లో అక్రమ కేసులు నిలబడక సత్యమే గెలిచిందని, ఆ కుట్రల ఫలితంగానే జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




