Rayachoti: రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌కు గాయాలు.. సుగవాసి పరామర్శ!
Rayachoti: రాయచోటి రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్ పల్లపు వాసును టీడీపీ నేత సుగవాసి పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి తరలించారు.
Rayachoti: రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌కు గాయాలు.. సుగవాసి పరామర్శ!
రాయచోటి, అన్నమయ్య జిల్లా
పెమ్మాడపల్లె మాజీ సర్పంచ్ పల్లపు వాసు గారిని పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు
రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ పల్లపు వాసు గురువారం రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై కాలికి గాయాలు కావడంతో రాయచోటిలోని సాయి ప్రశాంతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా వాసు గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
వాసు గారికి మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుని తిరుపతిలోని అమర హాస్పిటల్‌కు తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి త్వరితగతిన కోలుకునేలా అవసరమైన వైద్యం అందించాలని కోరారు.
పల్లపు వాసు గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆకాంక్షించారు.




