Rayachoti: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు బాధ్యత కీలకం సుగవాసి ప్రసాద్ బాబు
Rayachoti: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరికీ కీలక బాధ్యత ఉందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు రాయచోటిలో పిలుపునిచ్చారు.
Rayachoti: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు బాధ్యత కీలకం సుగవాసి ప్రసాద్ బాబు
Rayachoti: భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR–2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావాలంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు తమ వివరాలను ఒకసారి పరిశీలించి, ఎన్యుమరేషన్ ఫారమ్‌ను సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా మీ BLOకు అందజేయండి.
ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చు. ప్రతి ఇంటికి ఈ సమాచారాన్ని చేరవేసి, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, యువత అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా సహకరించాలని సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు.
Next Story




