Rayachoti: రాజు వరల్డ్ హై స్కూల్‌లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!
Rayachoti: రాయచోటిలోని రాజు వరల్డ్ హై స్కూల్‌లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు చిన్నారి విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అలరించారు.
Rayachoti: రాజు వరల్డ్ హై స్కూల్‌లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!
Rayachoti: రాయచోటిలోని రాజు వరల్డ్ హై స్కూల్లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారి విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈసందర్భంగా ఉపాధ్యాయులు కృష్ణత్వం గురించి విద్యార్ధులకు తెలియచేశారు. తొలుత ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపై శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ఈకార్యక్రమంలో రాజు వరల్డ్ హై స్కూల్ సిఈఓ, హెడ్మాస్టర్ గోపి, లోయర్ సెక్షన్ ఇంచార్జ్, ఉపాధ్యాయ,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులుపాల్గొన్నారు.
Next Story




