Rayachoti: వీరభద్రుని ఆలయంలో ఘనంగా పల్లకి సేవ

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 Aug 2026 9:33 PM IST
Rayachoti
X

Rayachoti: వీరభద్రుని ఆలయంలో ఘనంగా పల్లకి సేవ

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి లో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు సోమవారం పల్లకి సేవ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

స్థానిక భక్తులుతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి విచ్చేసిన భక్తులు పూజా కార్యక్రమం నందు పాల్గొన్నారు. వీరభద్రుని పూజలు అనంతరం మంగళ వాయిద్యాలు మేళతాళాలుతో భక్తులు పల్లకిని వీరభద్రుని మాదవీధుల్లో ఘనంగా ఊరేగించారు.

దేవస్థానం అర్చకులు భక్తులకు అర్చనలు చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందించినట్లు దేవస్థానం చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ మరియు దేవస్థాన కార్యనిర్వాహన అధికారి శ్రీ డివి రమణారెడ్డి గారు తెలియజేశారు..

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story