Rayachoti: రాయచోటి మంత్రిని కలిసిన నూతన ట్రాఫిక్ సీఐ

Rayachoti: రాయచోటి ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన చాంద్ బాషా. బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 July 2026 2:54 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి మంత్రిని కలిసిన నూతన ట్రాఫిక్ సీఐ

రాయచోటి: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని బదిలీపై నూతనంగా రాయచోటి ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన చాంద్ బాషా, చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి గారికి శాలువా కప్పి, పూల బొకే అందజేసి ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ట్రాఫిక్ సీఐ చాంద్ బాషాకు మంత్రి గారు అభినందనలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

అనంతరం రాయచోటి ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే అంశాలపై స్వల్పంగా చర్చించారు.

ఈ మర్యాదపూర్వక భేటీలో పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story