Rayachoti: కోనంపేట శివాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Rayachoti: అన్నమయ్య జిల్లా కోనంపేటలోని పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 18 July 2026 7:00 PM IST
Rayachoti
X

Rayachoti: కోనంపేట శివాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి: రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు... పరమేశ్వరుని ఆశీస్సులు కోరిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, కోనంపేట సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆహ్వానం మేరకు కోనంపేటలోని పురాతన శ్రీ పరమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మదన్మోహన్, దప్పేపల్లె సర్పంచ్ కేశవయ్య, కరెంట్ కాంట్రాక్టర్ యోగాంజనేయరెడ్డి, వెంకటనారాయణ, మచ్చా అంకన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొని మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story