Rayachoti: బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి గ్రాండ్ 'ప్రజా దర్బార్'!
Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలో నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Rayachoti: బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి గ్రాండ్ 'ప్రజా దర్బార్'!
Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని తన సొంత నివాసంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.
ప్రజల మధ్యే ఉంటూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. ప్రజా సేవలో ముందుకు సాగుతున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.
Next Story




