Rayachoti: రాయచోటి అభివృద్ధికి రూ.1000 కోట్లు టిడిపి నేత గండికోట సుధాకర్!
Rayachoti: రాయచోటి చిన్న ముక్కపల్లిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ కార్యక్రమాలపై గండికోట సుధాకర్ ప్రచారం. రూ.1000 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు.
Rayachoti: రాయచోటి అభివృద్ధికి రూ.1000 కోట్లు టిడిపి నేత గండికోట సుధాకర్!
Rayachoti: రాయచోటి మండలం చిన్న ముక్క పల్లి గ్రామ పంచాయతీలో బూత్ నంబర్ 81, 82, 83, 84, 86 లో పర్యటించి రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయచోటి రూరల్ మండల అధ్యక్షులు గండికోట సుధాకర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే, రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కృషితో రాయచోటి నియోజకవర్గం లో దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు మధుబాబు, రాయచోటి మండల తెలుగు యువత కార్యదర్శి శరత్ కుమార్ మరియు పిటిఎం పల్లె టిడిపి నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




