Rayachoti: రైతుల సంక్షేమమే ధ్యేయం చెరువు పనులను ప్రారంభించిన హరితమ్మ
Rayachoti: చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లిలో చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించిన మండిపల్లి హరితమ్మ. సాగునీటి వసతి పెరిగి రైతులకు మేలు జరుగుతుందని వెల్లడి.
Rayachoti: రైతుల సంక్షేమమే ధ్యేయం చెరువు పనులను ప్రారంభించిన హరితమ్మ
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లి గ్రామంలోని పాపిరెడ్డి గారి పల్లిలో గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన చెరువు అభివృద్ధి పనులను మండిపల్లి హరితమ్మ ప్రారంభించారు.
చెరువు అభివృద్ధి పూర్తయిన అనంతరం సాగునీటి వసతి మెరుగుపడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. మండిపల్లి హరితమ్మ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముగిరెడ్డప్ప, కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, యూనిట్ ఇన్‌చార్జ్ అశోక్, మల్లూరు మాజీ సర్పంచ్ నజీర్, మల్లూరు గ్రామ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, అలాగే కొత్తపల్లి, మల్లూరు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




