Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన డిగ్రీ కళాశాల సిబ్బంది
Rayachoti: ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధ్యాపక సిబ్బంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి కళాశాల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన డిగ్రీ కళాశాల సిబ్బంది
రాయచోటి: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అధ్యాపక, బోధనేతర సిబ్బంది ఎస్ఎన్ కాలనీలోని మంత్రి గారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని* మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కళాశాలకు సంబంధించిన పలు సమస్యలను, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.
సిబ్బంది వివరించిన సమస్యలను మంత్రి గారు సానుకూలంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యా రంగ అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.




