Rayachoti: రాయచోటి కే.రామాపురం ప్రాంతంలో పర్యటించిన డా. మండిపల్లి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి కే.రామాపురం ప్రాంతంలో టీడీపీ నాయకులు డా. మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పర్యటన.. ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 12 Sept 2026 12:27 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి కే.రామాపురం ప్రాంతంలో పర్యటించిన డా. మండిపల్లి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్‌లోని కె.రామాపురం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డ్రాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో నెలకొన్న రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వివరించిన సమస్యలను సావధానంగా విన్న డా. మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని, రాయచోటి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI