Rayachoti: నిత్యావసర ధరలు తగ్గించాలి: సీపీఐ డిమాండ్!
Rayachoti: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, బ్లాక్ మార్కెట్‌పై చర్యలు డిమాండ్ చేశారు.
Rayachoti: నిత్యావసర ధరలు తగ్గించాలి: సీపీఐ డిమాండ్!
Rayachoti: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా బుధవారం లక్కిరెడ్డిపల్లి మూడు రోడ్ల కూడలిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజల జీవనం కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్న వ్యాపారులు, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందించాలని కోరారు.




