Rayachoti: రాయచోటిలో ఆటో కార్మికుల నిరసన ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

Rayachoti: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ఆటో కార్మికులకు నివాస స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Aug 2026 7:43 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఆటో కార్మికుల నిరసన ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

రాయచోటి: మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ఆటో కార్మికులకు నివాస స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాయచోటి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ఆటో కార్మికులతో నిరసన తెలియజేశారు అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఆటో కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికుల్లో చాలామందికి సొంత ఇల్లు, నివాస స్థలం లేదని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అర్హులైన పేదలందరికీ పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తయింది.

పేదవాడికి ఎక్కడ జానడు జాగాని, సెంటు భూమి ఇవ్వలేదు, ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ఆటో కార్మికులను గుర్తించి వారికి నివాస స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు పసల ఆంజనేయులు,ఆటో వర్కర్స్ యూనియన్ బస్టాండ్ కార్యదర్శి కె రామ్మోహన్, ఆటో వర్కర్ యూనియన్ నాయకులు కే నరసింహులు, వెంకటేశు, చలపతి, బివిఎస్ రావు, జిలాని భాష, రమణ, మధు, శివ తదితరులు పాల్గొన్నారు

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story