Rayachoti: రాయచోటిలో ఘనంగా బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు
Rayachoti: రాయచోటిలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ పిలుపు.
Rayachoti: రాయచోటిలో ఘనంగా బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు
రాయచోటి: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.రంగ ప్రసాద్ పిలుపునిచ్చారు. రాయచోటి లోని సాయి శుభా కళ్యాణ మండపం నందు గురువారం అన్నమయ్య జిల్లా ఉత్సవ కమిటీ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కీ శే స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 171 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ జయంతి వేడుకలకు రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.రంగ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల విజ్ఞాలకు అధిపతి వినాయకుడిని వినాయక స్వామిని పూజిస్తే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. బాలగంగాధర్ తిలక్ భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగన్యుడు అని స్వాతంత్రం నా జన్మ హక్కు అని భారతదేశంలో హిందూ హిందూ సమాజం కోసం ఎనలేని కృషి చేశారనిఅన్నారు.
దేశంలో హిందూ సామ్రాజ్య భావన రగిలించి 16వ శతాబ్దంలోనే చత్రపతి శివాజీ వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించారని కొనియాడారు. 19వ శతాబ్దంలో బాలగంగాధర్ తిలక్ శివాజీని ఆదర్శంగా తీసుకొని గణేష్ ఉత్సవాలను దేశంలో మొదటగా ప్రారంభించి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారని కొనియాడారు.
హిందువుల ఐక్యంగా ఉండాలని ఆయన ఎలుగెత్తి చాటాడని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను ఏ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలోని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ గణేష్ ఉత్సవాలను కమిటీల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించాలన్నారు.
అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు శివగంగ రెడ్డి జిల్లా ఉత్సవ కమిటీ అధ్యక్షులు విజయకుమార్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలలో భక్తికి ప్రాధాన్యత నివ్వాలని కళాకారులకు గణేష్ ఉత్సవ కార్యక్రమములలో ధార్మిక భావన ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తి గీతాలు మాత్రమే ఉండాలన్నారు.




