Rayachoti: రాయచోటి ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు సువర్ణావకాశం

Rayachoti: రాయచోటిలో ఓపెన్ స్కూల్ ప్రవేశాల కరపత్రాల ఆవిష్కరణ. 10వ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోఆర్డినేటర్ సూచన.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 17 July 2026 5:21 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు సువర్ణావకాశం

రాయచోటి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు సువర్ణావకాశం కల్పించబడిందని, పాఠశాల విద్యను మధ్యలో నిలిపివేసిన వారు, పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయినవారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు.

శుక్రవారం డైట్ రాయచోటిలో ఓపెన్ స్కూల్ 2026–2027 విద్యాసంవత్సర ప్రవేశాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తై చదవడం, రాయడం తెలిసిన వారు పదో తరగతిలో ప్రవేశం పొందవచ్చని, పదో తరగతి ఉత్తీర్ణులై 15 సంవత్సరాలు నిండిన వారు ఇంటర్మీడియట్‌లో చేరేందుకు అర్హులని తెలిపారు.

ఓపెన్ స్కూల్ ద్వారా అభ్యాసకులకు ఉచితంగా స్వయం అభ్యాస పాఠ్యసామగ్రి ఇంటికే పంపిణీ చేయబడుతుందని తెలిపారు. రెండవ శనివారం, ఆదివారాల్లో తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమకు నచ్చిన ఐదు సబ్జెక్టులతో కోర్సును పూర్తి చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. గతంలో ఉత్తీర్ణులైన సబ్జెక్టుల మార్కులను బదిలీ చేసుకుని, మిగిలిన ఫెయిలైన సబ్జెక్టులను మాత్రమే రాసి కోర్సును పూర్తి చేసుకునే అవకాశం కూడా కల్పించబడిందని తెలిపారు.

ప్రవేశం పొందిన తేదీ నుంచి ఐదేళ్ల వ్యవధిలో తొమ్మిది పర్యాయాలు పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని, ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 31వ తేదీ వరకు అభ్యర్థులు ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు లేదా గుర్తింపు పొందిన ఓపెన్ స్కూల్ అభ్యసన కేంద్రాల ద్వారా ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, డైట్ అధ్యాపకులు, విద్యార్థి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story