Rayachoti: ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళన

Rayachoti: రాయచోటిలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 31 Aug 2026 7:10 PM IST
Rayachoti
X

Rayachoti: ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళన

రాయచోటి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్నమయ్య జిల్లాలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏపీజేఏసీ అమరావతి అన్నమయ్య జిల్లా చైర్మన్ నరసింహ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కు దిగారు.

సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి సార్ అంటూ ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదించారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు తమ ఆత్మ గౌరవ పోరాటం ఆగదని ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు.

ఉద్యోగుల సమస్యల సాధన కోసం ప్రతి ఒక్క ఉద్యోగి కదలి రావాలంటూ అన్నమయ్య జిల్లా చైర్మన్ నరసింహ కుమార్, ప్రధాన కార్యదర్శి గోపీ లు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు ఏపీ జేఏసీ అమరావతి నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story