Rayachoti: రాయచోటి అన్న క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన మౌర్య రెడ్డి!
Rayachoti: రాయచోటి అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన టీడీపీ యువ నాయకుడు మౌర్య రెడ్డి. ఆహార నాణ్యత, పరిశుభ్రత పరిశీలించి ప్రజలతో స్వయంగా మాటామంతీ.
Rayachoti: రాయచోటి అన్న క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన మౌర్య రెడ్డి!
Rayachoti: పేద, మధ్యతరగతి ప్రజల కోసం ₹5కే భోజనం అందించే అన్న క్యాంటీన్‌లో మంత్రి మేనల్లుడు, టీడీపీ యువ నాయకులు మౌర్య రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలపై భారం పడకుండా ₹5 ఖర్చును కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భరిస్తూ ఉచితంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్‌లో ఆహారం నాణ్యత, రుచి, పరిశుభ్రత, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
భోజనం చేస్తున్న పేద ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు నాణ్యమైన భోజనం అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని మౌర్య రెడ్డి తెలిపారు.




