Rayachoti: రాయచోటి శ్రీ చైతన్య స్కూల్ ఆర్ఐ తీరుపై విమర్శలు

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ చైతన్య స్కూల్ ఆర్ఐ మహబూబ్ బాషా వేధింపులు. ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వైనం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 18 Aug 2026 6:56 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి శ్రీ చైతన్య స్కూల్ ఆర్ఐ తీరుపై విమర్శలు

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆర్ఐ మహబూబ్ బాషా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.ఇద్దరు విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా 17వేల రూపాయలు బకాయిలు ఉన్నాయి అంటూ బుకాయిస్తున్నారు.

టీచరుకు రెండు నెలల జీతం ఇవ్వకుండా పైగా టీచర్ పైనే బెదిరింపులు దిగుతున్నాడు.ఏడు సంవత్సరాలు చైతన్య ఫస్ట్ బ్రాంచ్ లో పనిచేసిన టీచర్ భద్రయ్య ను గతంలో వేధిస్తూ ఉంటే.. చైతన్య బ్రాంచ్ ను వదిలి ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తూ... పేదరికంలో చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషిస్తూ కొనసాగిస్తున్న తరుణంలో...

ఆ ఉపాధ్యాయుడు భద్రయ్యకు ఇద్దరు పిల్లలు ఉండగా ఆ పిల్లలకు చైతన్య స్కూల్లోనే చదివిస్తూ ఉండగా 17వేల రూపాయలు ఫీజు చెల్లించలేదని ఇప్పటివరకు టీసీలు ఇవ్వకుండా చైతన్య విద్యాసంస్థల రాయచోటి ఫస్ట్ బ్రాంచ్ యాజమాన్యం పేద విద్యార్థులతో చెలగాటమాడుతున్నారు.

పేద విద్యార్థులు 17వేల రూపాయలు ఇవ్వాల్సినది నిజమైతే ఆర్ టీచర్కు పని చేపించుకొని జీతం ఇవ్వకుండా ఎందుకు చైతన్య విద్యాసంస్థ ఫస్ట్ బ్రాంచ్ ఉపాధ్యాయునికి ఎందుకో నరకం చూపిస్తున్నదో అర్థం కాని పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story