Rayachoti: రాయచోటి హత్యాయత్నం కేసు - నిందితులకు మూడేళ్ల జైలు

Rayachoti: 2024 ఎన్నికల ప్రచార గొడవలో హత్యాయత్నం చేసిన ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించిన రాయచోటి కోర్టు. బాధ్యుల పనితీరును అభినందించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 Aug 2026 4:37 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి హత్యాయత్నం కేసు - నిందితులకు మూడేళ్ల జైలు

రాయచోటి: రాయచోటి పరిధిలో 2024 నాటి ఎన్నికల ప్రచార వివాదంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు కాటిమాయకుంట గంగాధర్, అబ్బవరం శివరాం ప్రసాద్‌లకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఎన్నికల ప్రచారానికి రాలేదనే కారణంతో బాధితుడు మల్లికార్జున, ఆయన కుటుంబ సభ్యులపై నిందితులు కర్రలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు.

అప్పటి రాయచోటి అర్బన్ ఎస్ఐ ఎం భక్తవత్సలం కేసు నమోదు చేసి సరి అయిన ఆధారాలతో త్వరితగతిన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. రాయచోటి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీమతి ఈ ప్రసూన గారి ఎదుట జరిగిన విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి ₹1,000/- జరిమానా విధిస్తూ నేడు తుది తీర్పు వెలువడింది.

కేసును సమర్థవంతంగా నడిపించిన రాయచోటి డిఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, రాయచోటి అర్బన్ సీఐ. బి.వి.చలపతి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి. గుర్రప్ప, సాక్షులను సకాలంలో హాజరుపరిచిన కోర్టు లైజన్ ఆఫీసర్ మస్తాన్ వలి పనితీరును అభినందిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ప్రశంసించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story