Madanapalle: సీటీఎం రోడ్డులో అదుపుతప్పిన కారు.. స్థానికుల్లో భయాందోళన!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సీటీఎం రోడ్డులో అదుపుతప్పిన కారు ఆర్టీసీ బస్సుతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి బీభత్సం సృష్టించింది.
Madanapalle: సీటీఎం రోడ్డులో అదుపుతప్పిన కారు.. స్థానికుల్లో భయాందోళన!
మదనపల్లె: మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సీటీఎం రోడ్డులో రెడ్డప్పనాయుడు కాలనీ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు ఆర్టీసీ బస్సును ఢీకొని, అనంతరం అక్కడ ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




