Rayachoty: రాయచోటిలో KV హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో సుగవాసి ప్రసాద్!

Rayachoty: రాయచోటి బ్రాహ్మణవీధిలో KV హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో రాజంపేట టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని వైద్య బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Aug 2026 12:43 PM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటిలో KV హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో సుగవాసి ప్రసాద్!

Rayachoty:రాయచోటి పట్టణంలోని బ్రాహ్మణవీధి, రవితేజ హాస్పిటల్లో ఎదురుగా ఏర్పాటు చేసిన KV Hospitals నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డా. ఎస్. అబూ బకర్ సిద్దిక్ గారు మరియు డా. ఎస్. రుబీనా గారు సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఘనంగా ఆహ్వానించి, గజమాల వేసి, శాలువా కప్పి సత్కరించారు. అనంతరం హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

రాయచోటి ప్రజలకు ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన KV Hospitals ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని, హాస్పిటల్ యాజమాన్యం మరియు వైద్య బృందానికి శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు శుభాకాంక్షలు తెలిపారు.

“ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో KV Hospitals మరింత అభివృద్ధి సాధించి, ఎన్నో కుటుంబాలకు ఆరోగ్య భరోసాగా నిలవాలి” అని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story