Rajampet: ఇంటింటికీ తెలుగుదేశం విజయవంతం చేయాలి సుగవాసి ప్రసాద్ బాబు

Rajampet: టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అధ్యక్షతన కీలక సమావేశం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, డోర్ టు డోర్ కార్యక్రమం మరియు స్థానిక ఎన్నికల సన్నాహాలపై చర్చ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Aug 2026 9:52 PM IST
Rajampet
X

Rajampet: ఇంటింటికీ తెలుగుదేశం విజయవంతం చేయాలి సుగవాసి ప్రసాద్ బాబు

రాజంపేట: రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా “కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ‘డోర్-2-డోర్ – ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేసి స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయానికి కృషి చేయాలి” అని సుగవాసి ప్రసాద్ బాబు గారు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి మార్గదర్శకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ సమావేశంలో రాజంపేట నియోజకవర్గం ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు గారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ ఖాదర్ ఖాన్ గారు, పార్లమెంట్ కమిటీ సభ్యులు, అసెంబ్లీ స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story