Rajampet: రూ.25 లక్షలతో రోడ్డు పనులను ప్రారంభించిన శ్రీనివాసరాజు

Rajampet: సుండుపల్లి మండలంలో రూ.25 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులను జనసేన ఇన్‌చార్జ్ శ్రీనివాసరాజు ప్రారంభించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 3 Sept 2026 8:28 PM IST
Rajampet
X

Rajampet: రూ.25 లక్షలతో రోడ్డు పనులను ప్రారంభించిన శ్రీనివాసరాజు

రాజంపేట: ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు గారు అన్నారు.

సుండుపల్లి మండలంలోని పెద్దినేని కాలువ, మడితాడు గ్రామాల్లో రూ.25 లక్షలతో నూతనంగా రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ప్రస్తుతం జరిగే అభివృద్ధే నిదర్శనమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాలు, పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజలకు అవసరమైన రహదారులు, కాలువలు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను దశలవారీగా మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుండుపల్లి ఎంపీపీ రాజమ్మ, జనసేన మరియు కూటమి నేతలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story