Proddatur: కారు ఆపమన్నందుకు విచక్షణారహిత దాడి తీవ్రంగా గాయపడ్డ యువకుడు!

Proddatur: ప్రొద్దుటూరు గౌరమ్మకట్ట వద్ద దారుణం. కారు ఆపమన్నందుకు ధనుష్ కుమార్ అనే యువకుడిపై కర్రలతో విచక్షణారహిత దాడి, తీవ్ర గాయంతో ఒక కన్ను తొలగింపు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 15 Sept 2026 11:21 AM IST
Proddatur
X

Proddatur: కారు ఆపమన్నందుకు విచక్షణారహిత దాడి తీవ్రంగా గాయపడ్డ యువకుడు!

Proddatur: ​ప్రొద్దుటూరులోని గౌరమ్మకట్ట వీధిలో అర్ధరాత్రి వేళ దారుణ సంఘటన చోటుచేసుకుంది. వినాయక మండపం వద్ద ఏర్పడిన ట్రాఫిక్ సమస్యను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించిన ధనుష్ కుమార్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు.

ధనుష్ కంటికి తీవ్ర గాయమవ్వడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. తిరుపతి అరవింద ఐ హాస్పిటల్ వైద్యులు ధనుష్ కంటి సీరియస్ గా ఉండడం వల్ల ప్రాణాపాయం కలగకుండా కన్నును తీసేయాలని వైద్యులు తెలిపారు.? గౌరమ్మకట్ట వీధిలోని వినాయకుని విగ్రహం వద్ద రెండు కార్లు ఎదురెదురుగా రావడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు కొంచెం సేపు ఆగి వెళ్లాలని ధనుష్ కోరగా, ఆగ్రహానికి గురైన కారులోని ఇద్దరు వ్యక్తులు కిందకు దిగి కర్రలతో అతనిపై విచక్షణారహితంగా చితకబాదారు. ​ఈ దాడికి సంబంధించిన మొత్తం దృశ్యాలు సమీపంలోని సిసిటివి (CCTV) కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR