Proddatur: ప్రొద్దుటూరులో తీవ్ర కలకలం వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి!

Proddatur: ప్రొద్దుటూరు వసంతపేటలో వివాహిత సుసాన్ రాణి అనుమానాస్పద మృతి. ఇల్లు దుర్వాసన రావడంతో వెలుగులోకి వచ్చిన ఉదంతం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 July 2026 12:28 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో తీవ్ర కలకలం వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి!

Proddatur: ప్రొద్దుటూరు వసంతపేటలో వివాహిత అనుమానాస్పద మృతి పట్టణంలోని వసంతపేటలో తీవ్ర కలకలం రేగింది. ఒక ఇంట్లో ఒంటరిగా నివాసముంటున్న సుసాన్ రాణి (40) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు రెండు మూడు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంట్లో నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో గమనించిన ఇంటి యజమాని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, శవం ఉబి ఉండటంతో ఇది హత్యనా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె ఆ ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story