Proddatur: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
Proddatur: ప్రొద్దుటూరులో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవని చెప్పడంతో మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Proddatur: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ప్రొద్దుటూరు లో డిఎస్సి నియామాకల్లో అవకతవకలు జరగాయంటూ నేడు వైసీపీ నేతల నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు నేడు ప్రొద్దుటూరులో ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ, ర్యాలీని నిర్వహించి తీరతామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేయడంతో వన్ టౌన్ సీఐ కొండారెడ్డిఈ నిరసన ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదున్నారు. డీఎస్సీ లో జరిగిన అవకతవకలపై ప్రశ్నించే హక్కు మాకుంది. ప్రభుత్వం, పోలీసులు నోటీసులతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అనుమతులు నిరాకరించినా మా నిరసన తెల్పి తీరుతాం అని వైసీపీ నేతల పట్టుదల, పోలీసుల హెచ్చరికల మధ్య ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.




