Proddatur: ప్రొద్దుటూరులో దారుణం ఇన్స్టాగ్రామ్ ఆధారంగా హత్య కేసు ఛేదన!
Proddatur: బీహార్ యువకుడి హత్య కేసును ఛేదించిన రూరల్ పోలీసులు. ఇన్స్టాగ్రామ్, లొకేషన్ ఆధారంగా రామేశ్వరంలో ఇద్దరు నిందితుల అరెస్ట్: వెల్లడించిన ఏఎస్పీ.
Proddatur: ప్రొద్దుటూరులో దారుణం ఇన్స్టాగ్రామ్ ఆధారంగా హత్య కేసు ఛేదన!
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన బీహార్ యువకుడు మున్నా కుమార్ హత్య కేసును రూలర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా చేదించారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలు ప్రొద్దుటూరు డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ విభూకృష్ణ వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని ఒక డైరీ ఫామ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ముగ్గురు యువకులకు వస్తున్న ఉపాధి నగదు విషయంలో వీరి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నడుస్తున్నాయి ఈ క్రమంలో వివాదం ముదరడంతో దీపు కుమార్, బిర్జు కుమార్ అనే ఇద్దరు యువకులు కలిసి తోటి కార్మికుడైన ఏప్రిల్ 7వ తేదీన మున్నా కుమారును తాడుతో గొంతు బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.. మొదట ఈ ఘటనపై రూలర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర వైద్య నివేదికలు ఆధారంగా ఇది ముమ్మాటికీ హత్యానని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏఎస్పి విభూకృష్ణ ఆదేశాల మేరకు రంగంలోకి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి హైదరాబాద్, బీహార్, విజయవాడ పలు ప్రాంతాల్లో, విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.. రూలర్ పోలీసులు మొదటి నిందితులు దీపు కుమార్ ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండడంతో పోలీసులు గుర్తించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందుతుని గుర్తించారు .. ఈరోజు ఉదయం రామేశ్వరం లోని రెండు కొలయాల వద్ద ఇద్దరి నిందుతుల్ని అరెస్టు చేశాం. ఈ కేసును వేగంగా చేదించిన రూలర్ సీఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బందిని ఏఎస్పీ వీభూకృష్ణ ఈ సందర్భంగా అభినందించారు.




