Proddatur: కార్పొరేట్ సెలూన్ల దోపిడీపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆత్మీయ సమావేశం
Proddatur: ప్రొద్దుటూరులో స్థానిక నాయిబ్రాహ్మణుల ఉపాధిని దెబ్బతీస్తున్న కార్పొరేట్ సెలూన్లపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం.
Proddatur: కార్పొరేట్ సెలూన్ల దోపిడీపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆత్మీయ సమావేశం
ప్రొద్దుటూరు: కార్పొరేట్ సెలూన్ల వ్యాపారస్తులు చేస్తున్న దోపిడీని కట్టడి చేయడానికి ప్రొద్దుటూరు లో నాయిబ్రాహ్మణులతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం..
నాయిబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యానాదయ్య మాట్లాడుతూ బయటి ప్రాంతాల నుంచి వస్తున్నా ఈ కార్పొరేట్ సెలూన్ల వల్ల మా స్థానిక నాయిబ్రాహ్మణుల పొట్ట కొడుతున్నారు. తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని, తీవ్ర పేదరికంలో బతుకుతున్న మమ్మల్ని ఈ ప్రైవేట్ వ్యాపారస్తుల దోపిడీ ముంచేస్తోంది. మా స్థానిక వ్యాపారుల అభివృద్ధి కోసం మా కుటుంబ కోసం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న పోరాటానికి మా నాయిబ్రాహ్మణులందరి సంపూర్ణ మద్దతు గా ఉంటామన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇది నా ఒక్కడి పోరాటం కాదు... మన ఊరి శ్రామికుల కోసం మనం కలిసి చేయాల్సిన పోరాటం! ప్రొద్దుటూరుకు బయటి ప్రాంతాల నుంచి వచ్చి పడ్డ కార్పొరేట్ సెలూన్ వాళ్లకు నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నాను...
వెంటనే ఈ ప్రొద్దుటూరును వదిలి వెళ్లిపోవాలి..ఇక్కడి స్థానిక నాయిబ్రాహ్మణులు పేదరికంతో అల్లాడుతుంటే... కార్పొరేట్ కంపెనీల పేరుతో వచ్చి ప్రొద్దుటూరు ప్రజల సొమ్మును దోచుకుపోతామంటే చూస్తూ ఊరుకోం.. ప్రొద్దుటూరులో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా మొదట వచ్చేది ఈ నాయిబ్రాహ్మణులే... మంగళవాయిద్యాలతో ఆ నిమిషాన్ని పండగ చేసేది వీళ్లే.
చివరికి ప్రతి ఇంట్లో చావు మేళాలు వాయించి, బాధల్లో తోడుండేది కూడా ఈ నాయిబ్రాహ్మణ సోదరులే! మరి ఆ కార్పొరేట్ సెలూన్ కంపెనీల వాళ్లను అడుగుతున్నాను...శుభకార్యాల్లోనూ, చావు మేళాల్లోనూ మీరు ఎందుకు పాలుపంచుకోవడం లేదు? కేవలం లాభాలు దోచి పెట్టుకోవడం కోసం మాత్రమే మాత్రం ఇక్కడికి వస్తారా? ఈ దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం. స్థానిక నాయిబ్రాహ్మణుల హక్కుల కోసం, వారి జీవనోపాధి కోసం నేను పోరాడుతాను అన్నారు.
ఈ సమావేశం అనంతరం నాయిబ్రాహ్మణుల ప్రతినిధులు రచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యానాదయ్య, కడప జిల్లా నాయిబ్రాహ్మణ అధ్యక్షుడు గుర్రప్ప, వైయస్సార్సీపి కడప జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ పట్టణ నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు సంజీవ్ కర్ణ, శీను, దేవా, రాజా, తదితరులు పాల్గొన్నారు...




