Proddatur: ప్రొద్దుటూరులో పొలిటికల్ వార్!
Proddatur: ప్రొద్దుటూరు పొట్టిపాడు సిమెంట్ రోడ్డు వద్ద టీడీపీ - వైసీపీ వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, కాంట్రాక్టర్ల మధ్య ఉద్రిక్తత.
Proddatur: ప్రొద్దుటూరులో పొలిటికల్ వార్!
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు పొట్టిపాడు రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. టిడిపి వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులను ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రొద్దుటూరులోని పొట్టిపాడు రోడ్డులో ఇటీవల వేసిన రోడ్డు నాణ్యత లేదంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. ఆ క్రమంలోనే రోడ్డు పరిశీలించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, వైసీపీ నేత బంగారు రెడ్డి వెళ్లారు.
అదే సమయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి, రోడ్డు కాంట్రక్టర్ మహేశ్వర్ రెడ్డి అక్కడికి రావడంతో టిడిపి, వైసీపీ వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. పరిస్థితి ఉదృతంగా మరే అవకాశం ఉండటంతో పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టారు. పొట్టిపాడు రోడ్డులో పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టిడిపి నాయకులు, ప్రొద్దుటూరు టిడిపి నాయకులు ఏ టెండర్ లైన ఒక నాయకుడే వేస్తాడని వేరే వారికి అవకాశం ఇవ్వాలని వైసిపి నాయకులు మండిపడ్డారు.




