Proddatur: నకిలీ బంగారం దందా వ్యక్తి అరెస్ట్, రూ.6.50 లక్షల మోసం రట్టు
Proddatur: నకిలీ బంగారం పేరుతో రూ.6.50 లక్షలు మోసగించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు.
Proddatur: నకిలీ బంగారం దందా వ్యక్తి అరెస్ట్, రూ.6.50 లక్షల మోసం రట్టు
ప్రొద్దుటూరు: నకిలీ బంగారం పేరుతో 6.లక్షల 50 వేల మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు... ఏఎస్పి విభూ కృష్ణ..
కడప జిల్లా ప్రొద్దుటూరులో నకిలీ బంగారం పేరుతో రూ.6 లక్షల 50 వేల మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన నిందితుడి నుంచి నకిలీ బంగారు కడ్డీతో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన కన్నయ్య అనే వ్యక్తి, ప్రొద్దుటూరుకు చెందిన రవికుమార్‌కు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన రవికుమార్ రూ.6 లక్షల 50 వేల నగదు చెల్లించాడు. అనంతరం కన్నయ్య నకిలీ బంగారు కడ్డీలను అందజేశాడు. రవికుమార్ బంగారాన్ని పరీక్షించగా అది నకిలీ అని తేలడంతో వెంటనే ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు కన్నయ్యను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 100 గ్రాముల నకిలీ బంగారు కడ్డీ, ఒక ల్యాప్‌టాప్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో వన్టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు...
బైట్ : విభూకృష్ణ ( ప్రొద్దుటూరు ఏఎస్పీ)




