Proddatur: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు
Proddatur: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి. పాల్గొన్న నాయకులు.
Proddatur: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు టిడిపి కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మువ్వన్నెల జాతీయ జెండాను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, పతాక వందనం సమర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య స్వీట్లు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వాతంత్ర్య సమరయోధుల దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన త్యాగమూర్తులను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట పటిమ, దేశభక్తి, మరియు ఆదర్శాలు నేటి యువతకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అమరులైన యోధుల త్యాగాల వల్ల లభించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాపాడుకుంటూ, దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఎస్ ముక్తియార్, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ ఆసం రఘురాం రెడ్డి, అగస్వేశ్వర ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, రసూల్ గౌస్ వెంకటేశ్వర్లు,టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




