Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీ మహానాడు వేడుకలు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి!
Proddatur: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభం.
Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీ మహానాడు వేడుకలు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభించారు.. ప్రొద్దుటూరు మొత్తం 12 క్లస్టర్ గా విభజించినారు. 4వ క్లస్టర్ లో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి జండా ఆవిష్కరించి అనంతరం స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మహానాడు వేదిక వద్ద ఏర్పాటుచేసిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి, నంద్యాల కొండారెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, బద్వేల్ శ్రీనివాసులు రెడ్డి, పరిశీలకులు భావన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వీక్షించారు..
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మహానాడు పండుగలు జరుపుకుంటాం.. పార్టీ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపారు.
ఎమ్మెల్యే తనయుడు నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ గతంలో మహానాడు సభలను భారీ బహిరంగ సభలుగా నిర్వహించేవారు.. అయితే పొదుపు చర్యల వల్ల అంతర్జాతీయ పరిస్థితుల రీత్య ఇంధన పొదుపు చేయాలన్న మహానాడు కార్యక్రమాలను వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంచడానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు అన్ని ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ గెలిపించుకుందామని తెలిపారు.




