Kadapa: ప్రొద్దుటూరులో క్రికెట్ బెటర్స్ అరెస్ట్.. ఎఎస్పి విభూకృష్ణ

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. ఏఎస్పీ విభూ కృష్ణ ఆధ్వర్యంలో 13 మంది బెటర్స్ అరెస్ట్.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 31 May 2026 8:49 AM IST
Kadapa
X

Kadapa: ప్రొద్దుటూరులో క్రికెట్ బెటర్స్ అరెస్ట్.. ఎఎస్పి విభూకృష్ణ

Kadapa: ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు జరుగుతున్న సందర్భంగా క్రికెట్ బెటర్స్ ను అరెస్టు చేసిన ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన ఏఎస్పి విభూ కృష్ణ.. 13 మంది క్రికెట్ బుక్కిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారుగా 11 లక్షల 84 వేల నగదు 17 సెల్ ఫోన్స్, ఒక లాప్టాప్ స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పి తెలిపారు. ప్రొద్దుటూరు టూ టౌన్ సిఐ వంశీనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బృందం బెట్టింగ్ కార్యక్రమాలపై నిఘ పెట్టగా షేక్ జావిద్, ఎల్లాల షేక్ జిలాని అదుపులోకి తీసుకొని విచారించగా మరొక 11 మందికి బెట్టింగ్ కార్యకలాపాలలో ఉన్నట్టు గుర్తించగా వీళ్ళ ను ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు అరెస్టు చేసినట్టు తెలిపారు. 13 మందిని అరెస్టు చేసిన వారి బ్యాంకు ఖాతాలో ఉన్న మరో 14లక్షల 12 వేల రూపాయలను జప్తు చేశామన్నారు.. అక్రమంగా బెట్టింగ్, జూదాలపై ఘట్టి నిఘ ఉంచామని కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. యువతకి క్రికెట్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ వంశీనాథ్, ఎస్సై రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story