Proddatur: కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్

Proddatur: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 27 July 2026 4:37 PM IST
Proddatur
X

Proddatur: కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్

ప్రొద్దటూరు: కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "తల్లికి వందనం" పథకం పేరుతో రాష్ట్రంలోని తల్లులను నాలుగు రకాలుగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ​అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రతీ విద్యార్థికి 15 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కేవలం 13 వేలు మాత్రమే జమ చేసి మాట తప్పిందని రాచమల్లు ఆరోపించారు.

రాష్ట్రంలో 80 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉంటే, కేవలం 60 లక్షల మందికే ఇస్తూ.. మిగతా 20 లక్షల మంది విద్యార్థులకు ఎగ్గొట్టారని మండిపడ్డారు. అందరికీ పూర్తి డబ్బులు వేయలేదని, చాలామంది అకౌంట్లలో కేవలం 5 వేలు నుండి 10 వేలు మాత్రమే జమ అయ్యాయని తెలిపారు.

ఎందుకని అధికారులను ప్రశ్నిస్తే సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలంటూ దాటవేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రజలు "సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం" అనేలా సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. ​సూపర్ సిక్స్ పథకాలు

పాదయాత్రలు, గడప గడపకూ తిరుగుతున్న టీడీపీ నేతలు ఈ రెండేళ్లలో ఏం సాధించారని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను కాపీ కొట్టి సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, ​3 వేలు నిరుద్యోగ భృతి ఏమైంది. ​18 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తామన్న 'ఆడబిడ్డ నిధి' ఏది, ​కొత్త పింఛన్లు, ఉద్యోగుల బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదు అంటూ మండిపడ్డాడు.​

అన్నదాత సుఖీభవ కింద దాదాపు 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలన్నీ అమలు చేశామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం, ప్రజలను విపరీతంగా మోసం చేస్తోందని, తక్షణమే సూపర్ సిక్స్ హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో నెరవేర్చాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story