Proddatur: ప్రొద్దుటూరు విద్యుత్ సబ్స్టేషన్ రగడ

Proddatur: ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల నిలిపివేతపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం. కలెక్టర్ హామీతో ధర్నా విరమించినట్లు వెల్లడి.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 July 2026 7:52 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు విద్యుత్ సబ్స్టేషన్ రగడ

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీనివాసనగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్పందించారు. పనులను పదేపదే నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, జిల్లా కలెక్టర్ హామీతో తాను చేపట్టాలనుకున్న ధర్నాను విరమించుకున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌లో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు.

సబ్‌స్టేషన్ నిర్మాణ స్థలం ప్రైవేట్ భూమి అని ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించగా, అది ప్రభుత్వ భూమేనని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను మళ్లీ ప్రారంభించామని, అయితే జిల్లా విద్యుత్ శాఖ అధికారి మరోసారి పనులను నిలిపివేశారని ఆరోపించారు.

ఈ విషయంపై నిరసనగా ధర్నా చేపట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ, జిల్లా కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి పనులను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఎస్ ముక్తయర్, ఈఈ చాంద్ భాషా, మాజీ పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి, ఖలీల్, పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story