Proddatur: ప్రొద్దుటూరులో రెండో రోజు దస్తావేజుల లేఖరుల సమ్మె

Proddatur: ప్రొద్దుటూరులో జీవో 396 రద్దు కోరుతూ దస్తావేజుల లేఖరుల నిరసన. సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రచమల్లు శివప్రసాద్ రెడ్డి, ప్రభుత్వానికి హెచ్చరిక.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 21 July 2026 4:20 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో రెండో రోజు దస్తావేజుల లేఖరుల సమ్మె

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో దస్తావేజుల లేఖరుల నిరావధిక సమ్మె రెండో రోజుకు చేరింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద లేఖరులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నిరసన తెలుపుతున్న లేఖలను మద్దతుగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి రచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కార్యకర్తలతో కార్యాలయం వద్దకు చేరుకొని వారికి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ వెంటనే జీవో నెంబర్ తో 396 ను రద్దు చేయాలి.

ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నామన్నారు. పేద మధ్య ధనవంతులు అన్ని వర్గాల సంబంధించిన అభ్యంతరాలు ప్రజల వైపు నుంచి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్న.. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ప్రైవేటీకరణ చేసే దానికి ఈ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆర్టీసీ బస్సులు, విద్యాలయాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, అన్ని వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న ఈ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా ప్రైవేటీకరణ చెయ్యి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మీ దోపిడీ పాలన చివరికి రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షలు మంది దస్తావేజుల లేఖరులను ప్రతిరోజు ప్రజలకు అనుగుణంగా వారికి వివరించి రిజిస్ట్రేషన్లు అయ్యే దానికి సహాయపడుతున్న వారి ఈ ప్రభుత్వం దస్తావేజుల లేఖరుల నోళ్ళల్లో దుమ్ము కొడుతుంది. ఈ జీవో నెంబర్ 396 ను కొనసాగిస్తే వారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులను ఈ కార్యాలయంలో నియమించుకొని, వారు ప్రజల వద్ద ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది కొనసాగిస్తే భూములు కబ్జాలకు గురై అదే విధంగా మోసాలు చేస్తారు.. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాము వెంటనే 396 జీవోను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్లు 5 లక్షల మందే కదా అని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వీరి వెనకాల రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దస్తావేజు లేఖరులను సోదరుల పక్షాన గట్టిగా ఉద్యమంలో భాగస్తులమైతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఈ దస్తావేజులు లేఖరుల ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలపై ప్రభుత్వం పునరాలోచించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో దస్తావేజుల లేఖరుల అధ్యక్షుడు జమాలుద్దీన్, ఉపాధ్యక్షుడు కొవ్వూరు మునిశేఖర్, అలీ భాష, కొండారెడ్డి, రమేష్ యాదవ్, సుభాష్, కృష్ణ, నాగరాజు, నారాయణ, పవన్, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story