Pulivendula: స్కూల్ బస్సు టైర్లు ఊడినా సురక్షితంగా 30 మంది విద్యార్థులు!
Pulivendula: కడప జిల్లా పులివెందుల ముద్దునూరు రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు టైర్లు ఊడిపోయాయి.
Pulivendula: స్కూల్ బస్సు టైర్లు ఊడినా సురక్షితంగా 30 మంది విద్యార్థులు!
పులివెందుల: కడప జిల్లా పులివెందులలోని ముద్దునూరు రింగ్ రోడ్డు వద్ద ఒక ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన AP 04 TT8378 బస్సు టైర్లు ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది జరకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
పల్లె ప్రాంతాల నుంచి విద్య నేర్చుకునేందుకు ప్రైవేట్ స్కూలు బస్సులను ఏర్పాటు చేశాయి. ప్రైవేట్ పాఠశాల బస్సులు నామమాత్రంగానే ఉన్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో దాదాపు 30 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రమాదం జరిగితేనే స్పందించే అధికారులు ఇప్పటికైనా తక్షణం ప్రైవేటు స్కూలు బస్సులపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story




