Mydukur: ఆగస్టు 10న ‘చలో విజయవాడ’.. పోస్టర్ ఆవిష్కరణ!

Mydukur: దువ్వూరు సెక్షన్‌లో 'చలో విజయవాడ' పోస్టర్‌ను విద్యుత్ సంఘాలు ఆవిష్కరించాయి. పీఆర్‌సీ, కాంట్రాక్ట్ కార్మికుల విలీనం, డీఏల విడుదలకై డిమాండ్ చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 25 July 2026 12:00 PM IST
Mydukur
X

Mydukur: ఆగస్టు 10న ‘చలో విజయవాడ’.. పోస్టర్ ఆవిష్కరణ!

ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ

- రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీ న విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్ పేర్కొన్నారు.శనివారం దువ్వూరు సెక్షన్ నందు జరిగిన చలో విజయవాడ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమానికి

ముఖ్య వక్తలు ఏపీ విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నాయబ్ రసూల్ స్ట్రగుల్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు బి.ఎన్.నాగసుబ్బయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

1. ప్రధాన డిమాండ్లు

కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ: తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌ లో కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థల్లో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి.

పిఆర్ సి నియమించాలి: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ (పి ఆర్ సి ) ఒప్పంద గడువు గత మార్చి లోనే ముగిసింది. కాబట్టి వెంటనే వేతన సవరణ సంప్రదింపుల కమిటీని నియమించి చర్చలు జరపాలి.

డీఏ ల విడుదల: ఉద్యోగులకు పెండింగ్‌ లో ఉన్న 4 డీఏ లను (DA) తక్షణమే విడుదల చేయాలి.

కనీస వేతనం: కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.48 వేలు అమలు చేయాలి.

థర్డ్ పార్టీ విధానం రద్దు: థర్డ్ పార్టీ విధానాన్ని తొలగించి, యాజమాన్యమే నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లించాలి. దీనివల్ల సంస్థకు కోట్ల రూపాయలు ఆదా అవ్వడమే కాకుండా కార్మికులకు న్యాయం జరుగుతుంది.

2. ఉద్యోగుల సమస్యలు - ఇతర డిమాండ్లు

ఇన్సూరెన్స్ ఇబ్బందులు: టాటా ఏ ఐ జీ ఇన్సూరెన్స్ కారణంగా విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకోవాలి. టాటా ఏఐజి ఇన్సూరెన్స్ పైన యాజమాన్యం చర్యలు తీసుకున్నంత వరకు ఎస్పీడీసీఎల్ పరిధిలో పాత ఇన్సూరెన్స్ ప్రకారము బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

జెఎల్ యం ఉద్యోగాల భర్తీ: ఖాళీగా ఉన్న జూనియర్ లైన్‌మెన్ (JLM) మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, అనుభవజ్ఞులైన కాంట్రాక్ట్ కార్మికుల తోనే భర్తీ చేయాలి.

మైదుకూరు డివిజన్లో కాశీనాయన ,కలసపాడు సెక్షన్ల లో నూతన లైన్ ఇన్స్పెక్టర్ పోస్టులు మంజూరు చేయాలని మైదుకూరు డివిజన్ హెడ్ క్వార్టర్ నందు ఎస్.ఎల్.ఐ పోస్టులు మరియు ఫోర్ మెన్ పోస్టు లను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

పదోన్నతులు & గ్రేడ్ మార్పు:

2019 నాటి జేఎల్‌ఎంలకు ఏఎల్‌ఎంలుగా (ఏఎల్ యం ) పదోన్నతులు కల్పించాలి. ఏపీ జెన్‌కోలో పనిచేస్తున్న స్కిల్డ్ కాంట్రాక్ట్ కార్మికులను హై స్కిల్డ్ కార్మికులుగా మార్చి, వేతన వ్యత్యాసాలను సవరించాలి. మైదుకూరు డివిజన్లో ఓ&ఎమ్ కార్మికులకు గత 11 నెలల నుంచి ప్రమోషన్ కల్పించలేదు వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు.

భద్రత & పెన్షన్:పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. విద్యుత్ ఉద్యోగులకు నగదు రహిత (కాశ్లేస్ ) వైద్య సదుపాయం తో పాటు రూ. 1 కోటి బీమా సౌకర్యం కల్పించాలి.

3. పాలకుల తీరుపై విమర్శలు

యువ గళం పాదయాత్రలో విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలి.

ఏపీ జెన్‌ కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించడంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న కార్మికుల పాత్ర కీలకమైంది.

ప్రభుత్వం కేవలం ప్రశంసలు, అభినందన లకే పరిమితం కాకుండా, కార్మికుల నిజమైన డిమాండ్లను పరిష్కరించి నప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు ప్రకటించాలి.

ఆగస్టు 10 తేదీన చలో విజయవాడ" కార్యక్రమని కి దువ్వూరు సెక్షన్ కాంట్రాక్టు మరియు రెగ్యులర్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి బండి రామ్మోహన్, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగ మల్లయ్య, డివిజన్ నాయకులు ఎన్వి రమణ, పాల శీను, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రమణారెడ్డి, నరసింహ, వరదా రెడ్డి, మౌలాలి, శివరాం, నరేష్, రవి, కృష్ణ చంద్రారెడ్డి, వినోద్, రఘురామిరెడ్డి, సుబ్బారెడ్డి, జయసింహ, తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story