Porumamilla: పోరుమామిళ్లలో నెల రోజుల పాటు ఆర్టీసీ బస్సుల మళ్లింపు

Porumamilla:పోరుమామిళ్లలో సీసీ రోడ్డు పనుల వల్ల నెల రోజుల పాటు ఆర్టీసీ బస్సుల మళ్లింపు. బస్టాండ్‌లోకి బస్సులు రద్దు.. దుకాణాల అద్దెలు మాఫీ చేయాలని వ్యాపారుల డిమాండ్.

P Upendra, Kadapa Porumamilla
Published on: 7 Sept 2026 8:18 PM IST
Porumamilla
X

Porumamilla: పోరుమామిళ్లలో నెల రోజుల పాటు ఆర్టీసీ బస్సుల మళ్లింపు

పోరుమామిళ్ల: పోరుమామిళ్ల ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కారణంగా పోరు మామిళ్లలో రాకపోకలు సాగించే బస్సుల మార్గాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.రోడ్లుమరియు భవనాల శాఖ (R&B)ఆధ్వర్యంలో బస్ స్టేషన్ ప్రధాన రహ దారి ముందు భాగంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు 7వ తేది నుండి ప్రారంభం కానున్నందున,సుమారు నెల రోజుల పాటు బస్ స్టేషన్‌లోకి ఏ ఒక్క బస్సునూ అనుమతించబోమని ఆర్టీసీ బద్వేల్ డిపోమేనేజర్ కన్యా కుమారి తెలిపారు.

​ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు:

​బద్వేల్ ,మైదుకూరు వైపు వెళ్లే సెక్టార్ బస్సులను అంబేద్కర్ సర్కిల్ మీదుగా మళ్లించి నడిపిస్తారు.​గిద్దలూరు, మార్కాపురం సెక్టార్ల నుంచి వచ్చే బస్సులను పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వద్దే నిలిపివేయనున్నారు.​గిద్దలూరు, మార్కాపురం మార్గంలో వెళ్లే బస్సులు మాత్రం బస్ స్టేషన్‌ లోపలికి వెళ్లకుండా నేరుగా తమ గమ్య స్థానాలకు పయనిస్తాయని తెలిపారు.​

ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా అంబేద్కర్ సర్కిల్ లేదా పోలీస్ స్టేషన్ వద్ద వేచి ఉండి బస్సులు ఎక్కాలని సూచించారు.

​ వ్యాపారులఆందోళన-అద్దెలు రద్దుచేయాలనివిజ్ఞప్తి:*

నెల రోజుల పాటు బస్ స్టేషన్‌లో కి బస్సులు రాకపోతే తమ వ్యాపా రాలు పూర్తిగా దెబ్బ తింటాయని బస్టాండ్ ప్రాంగణంలోదుకాణాలు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకుల రాకపోకలు నిలిచి పోవడంతో రోజువారీ గడవడం కూడా కష్టమవుతుందని వాపో తున్నారు. ఈ నేపధ్యంలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించి, రాక పోకలు నిలిచిపోయిన ఈ నెల రోజుల పాటు దుకాణాల అద్దెల ను పూర్తిగా రద్దు చేసి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla

Next Story